బీజేపీ 24 గంటలూ ద్వేషాన్నే వ్యాప్తి చేస్తోంది : రాహుల్ గాంధీ

మతపరమైన విభేదాలను ఆయుధంగా చేసుకొని, బీజేపీ విద్వేషాన్ని వ్యాప్తి చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. అసలు సమస్యల నుంచి పక్కదారి పట్టేందుకే ద్వేషం అనే అంశాన్ని బీజేపీ 24 గంటలు వ్యాప్తి చేస్తోందని మండిపడ్డారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఢిల్లీకి చేరింది. ఈ యాత్రలో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, కమల్ హసన్ పాల్గొన్నారు. తాను 2,800 కిలోమీటర్లు నడిచానని, కానీ ఎలాంటి ద్వేషం చూడలేదన్నారు. టీవీని ఆన్ చేసినప్పుడు మాత్రం హింస, ద్వేషం కనిపిస్తోందని విమర్శించారు.

తమ జోడో యాత్రకు లభిస్తున్న ఆదరణ చూసి బీజేపీ భయపడుతోందని, అందుకే నిలిపేయాలని చూస్తోందని మండిపడ్డారు. కొత్త వేరియంట్ కలవరం సమయంలో బీజేపీ పలు రాష్ట్రాల్లో యాత్రలు చేపడుతోందని, కానీ ఆరోగ్య శాఖ మాత్రం తనకు లేఖలు పంపుతోందని మండిపడ్డారు. కేంద్రంలో ఉన్నది మోడీ సర్కార్ కాదని.. అది అంబానీ,అదానీల సర్కార్ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఆ వ్యాపారవేత్తల జేబులోనే కేంద్ర ప్రభుత్వం ఉందని.. వారి కనుసన్నల్లోనే దేశ పాలన నడుస్తోందని మండిపడ్డారు.

Related Posts

Latest News Updates