కైకాల సత్యనారాయణ భౌతికదేహానికి చిరంజీవి, పవన్ కల్యాణ్ నివాళులు అర్పించారు. కైకాల మరణ వార్త విని హుటాహుటీన ఆయన నివాసానికి చేరుకున్న చిరంజీవి కైకాల పార్థీవదేహాన్ని చూసి వెక్కి వెక్కి ఏడ్చేశారు. ఈ సందర్బంగా కైకాలతో వున్న అనుబంధాన్ని చిరంజీవి మరోమారు గుర్తు చేసుకున్నారు. కల్మషం లేని చిన్నపిల్లల మనస్తత్వం ఆయనదని, ఆయనతో తనకు ఎన్నో అనుభూతులు వున్నాయన్నారు. ఆయన్ను దూరం చేసుకోవడం బాధగా వుందన్నారు. ఇక… పవన్ కల్యాణ్ సైతం కైకాలతో వున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన అజాత శత్రువని అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు అన్నారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేశారు.












