నాసల్ వ్యాక్సిన్ కు కేంద్రం ఆమోదం… నేటి నుంచే అందుబాటులోకి

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గత అనుభవాల నేపథ్యంలో కేంద్రం ముందే అప్రమత్తమైంది. అప్రమత్తతలో భాగంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ రూపొందించిన రెండు చుక్కల నాసల్ (నాసికా టీకా) వ్యాక్సిన్ కు కేంద్రం ఆమోదం తెలిపింది.ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటన వెలువరించింది. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న టీకా కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం నుంచే ఈ నాసల్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది.

 

ప్రస్తుతానికి కేవలం ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే ఇది లభ్యం అవుతుంది. ఇప్పటికే కోవిషీల్డ్, కోవాగ్జిన్ తీసుకున్న వారు ఈ నాసల్ వ్యాక్సిన్ ను బూస్టర్ గా తీసుకోవచ్చని అధికారులు సూచించారు. దీనిని బూస్టర్ డోస్ గా వినియోగించేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నవంబర్ లోనే అత్యవసర అనుమతి ఇచ్చింది. ఇప్పుడు దీనికి కేంద్రం ఆమోదం లభించింది.

Related Posts

Latest News Updates