పరిస్థితి సంక్లిష్టంగా మారముందే… అడ్డుకట్ట వేసేయండి : ప్రధాని మోదీ సూచన

ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. దేశంలో ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా వుండాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రుల్లో ఇప్పటి నుంచి మౌలిక వసతులు, మానవ వనరులు, ఆక్సిజన్ సిలిండర్లను సిద్ధం చేసుకొని, ఉంచుకోవాలని సూచించారు. కోవిడ్ కేసులను పర్యవేక్షించలని రాష్ట్రాలకు సూచించారు. ఔషధాల లభ్యత, ధరలను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూనే వుండాలన్నారు. జీనోమ్ సీక్వెన్సింగ్ పై కన్నేయాలని, కోవిడ్ కు సంబంధించిన పరీక్షలను మరింత పటిష్టంగా నిర్వహించాలని కూడా సూచించారు.

”కోవిడ్ ఇంకా అంతం కాలేదు. రద్దీ ప్రాంతాల్లో మాస్కులు కచ్చితంగా ధరించండి. పండగలు, నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా వుండాలి” అని మోదీ సూచించారు. కోవిడ్ పరిస్థితి సంక్లిష్టంగా మారడకుండా మొదటి నుంచే జాగ్రత్త వహించి అడ్డుకోవలన్నారు. కోవిడ్ నియమాలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో నిఘా పెంచాలన్నారు.

 

ప్రికాషన్ డోస్ అందరికీ అందేలా చూడాలని ,త్వరగా వైరస్ ప్రతాపానికి గురయ్యేవారు, వ్రుద్ధలుకు ప్రికాషన్ డోస్ అందుబాటులో వుంచాలన్నారు. టెస్టింగ్ సంఖ్యను పెంచాలని ఆదేశించారని ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ భేటీలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, విదేశాంగ మంత్రి జైశంకర్, అనురాగ్ ఠాకూర్, నీతి ఆయోగ్ సీఈవో అయ్యర, వీకే పాల్, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

Latest News Updates