ఎక్స్‌బీబీ వేరియంట్ వ్యాప్తి అంటూ వస్తున్న మెసేజ్ లు పూర్తిగా తప్పు : కేంద్రం క్లారిటీ

భారత్ లో ఎక్స్ బీబీ వేరియంట్ వ్యాపిస్తోందంటూ వాట్సాప్ లో తీవ్రంగా వైరల్ అవుతోంది. అయితే.. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ క్లారిటీ ఇచ్చింది. అది తప్పుదోవ పట్టించే సమాచారమని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఓ ప్రకటన జారీ చేసింది. ఇది తప్పుదోవ పట్టించే మెసేజ్ అని, బూటకపు మెసేజ్ అని స్పష్టం చేసింది. ఈ మెసేజ్‌ను నమ్మవద్దని, ఇతరులకు పంపించవద్దని ప్రజలను కోరింది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎక్స్‌బీబీ వేగంగా వ్యాపిస్తోందని, ఇది గతంలో వచ్చిన డెల్టా వేరియంట్ కన్నా ఐదు రెట్లు ప్రమాదకరమైనదని, దీనివల్ల మరణాల రేటు అధికంగా ఉంటుందని ఈ మెసేజ్ హెచ్చరిస్తోంది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఎక్స్‌బీబీ వేరియంట్ అంతకుముందు వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ కన్నా ఎక్కువ ప్రాణాంతకమైనదని చెప్పడానికి తగిన ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ల్టా వేరియంట్ కన్నా ఒమిక్రాన్ వేరియంట్ తక్కువ ప్రాణాంతకమైనదని పేర్కొంది. ఎక్స్‌బీబీ వేరియంట్ అంతకుముందటి ఒమిక్రాన్ వెర్షన్స్ కన్నా వేగంగా వ్యాపించగలదని, అయితే దీనివల్ల సోకే వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుందని తెలిపింది.

Related Posts

Latest News Updates