స్క్రీన్ పై బాబూ జగ్జీవన్ రామ్ బయోపిక్…

దేశంలోని ప్రముఖ వ్యక్తులు, రాజకీయ నేతలపై సినిమా బయోపిక్ లు రావడం ఈ మధ్య ట్రెండ్ గా మారింది. ఇప్పటికే పలువురు ప్రతిష్ఠిత వ్యక్తుల జీవిత గాథలు తెరకెక్కాయి. తాజాగా.. అలాంటిదే మరోటి రాబోతోంది. స్వర్గీయ బాబూ జగ్జీవన్ రామ్ జీవిత చరిత్రను దర్శకుడు దిలీప్ రాజా వెండితెరపై ఆవిష్కరించనున్నారు. గతంలో అంబేడ్కర్ జీవిత చరిత్రను చిత్రీకరించిన ఆయన ప్రస్తుతం” బాబూజీ ” టైటిల్ తో గుంటూరు జిల్లా తెనాలి పరిసర ప్రాంతాల్లో ఈ బయోపిక్ రూపొందిస్తున్నారు. మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ బి రామాంజనేయులు తొలి క్లాప్ కొట్టగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లిడ్ కాప్ అధ్యక్షులు కాకుమాను రాజ శేఖర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

 

జగ్జీవన్ రామ్ కుమార్తె మీరా కుమార్ పాత్రను సీనియర్ నటి తాళ్లూరి రామేశ్వరి పోషిస్తున్నారు. టైటిల్ రోల్ ను మిలటరీ ప్రసాద్ చేస్తున్నట్లు దర్శకుడు దిలీప్ రాజా ప్రకటించారు. స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీజీ అనుచరుడిగా బాబూ జగ్జీవన్ రామ్ సత్యాగ్రహల్లో పాల్గొని బ్రిటీష్ జైళ్లల్లో గడిపిన రోజుల్లో జరిగిన సంఘటనలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. ఇందులో సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్ లాల్ నెహ్రూ, బాబూ రాజేంద్రప్రసాద్, భగత్ సింగ్, ఇందిరా గాంధీ పాత్రలు కీలకంగా ఉంటాయని దర్శకులు దిలీప్​ రాజా చెప్పారు. రెండవ షెడ్యూల్ ను బీహార్ లోని చాంద్వ గ్రామంలో షూటింగ్ నిర్వహిస్తామని తెలిపారు.

Related Posts

Latest News Updates