ఖమ్మం వేదికగా టీడీపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. దీనికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హాజరయ్యారు. అయితే.. చంద్రబాబుపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా విరుచుకుపడ్డారు. తెలంగాణలో టీడీపీ ఇప్పటికే భూ స్థాపితమైందని విమర్శించారు. చంద్రబాబును తెలంగాణ ప్రజలు తిరస్కరించారని, ఆయన రాజకీయాలు ఇక్కడ నడవవని హెచ్చరించారు. తెలంగాణలోకి మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలని చంద్రబాబు తెగ ఉవ్విళ్లూరుతున్నారని, అది సాధ్యం కాదన్నారు.
చుక్కలు ఎన్ని ఉన్నా చంద్రుడు ఒక్కడే అన్నట్లు తెలంగాణలో కేసీఆర్ఒక్కరే అని అన్నారు. చంద్రబాబు వచ్చి మళ్లీ ఇక్కడ పార్టీని రివైవ్ చేయాలని అనుకుంటున్నారని తెలిపారు. వాళ్లు తెలంగాణ బాగును కోరిన వాళ్ళు కాదన్నారు. వాళ్ళను తెలంగాణ ప్రజలు రిజెక్ట్ చేశారని అన్నారు. ఇప్పుడు వచ్చి రాజకీయం చేద్దాం అని అనుకున్న మళ్లీ రిజెక్ట్ చేస్తారని కవిత పేర్కొన్నారు.







