జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ తెలంగాణ ప్రభుత్వానికి భారీ జరిమాన విధించింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేసులో 900 కోట్ల రూపాయల జరిమాను ఎన్జీటీ విధించింది. పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే ప్రాజెక్టు నిర్మాణం కొనసాగిస్తున్నారని, దీని ద్వారా కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన చెన్నై NGT.. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మించినందుకు రూ. 300 కోట్ల జరిమానాను విధించింది.
అలాగే పర్యావరణ నష్టపరిహారానికి రూ. 528 కోట్లు జరిమానా వేసింది. అటు దిండి ప్రాజెక్టులో పర్యావరణ నష్టపరిహారానికి రూ. 92.8 కోట్ల జరిమానా వేసింది. ఈ జరిమానాలన్ని మూడు నెలల్లో చెల్లించాలని ఆదేశించింది. జరిమానా మొత్తాన్ని కృష్ణా రివర్ మెనేజ్ మెంట్ బోర్డు దగ్గర జమ చేయాలని ఎన్జీటీ ఆదేశించింది. ఇక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పర్యవేక్షణకు కేంద్ర ప్రభుత్వ అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని సూచించింది.