ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు వుండటంతో రాజకీయంగా దుమ్ము దుమారం రేగుతోంది. దీనిపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మాట్లాడాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. మరో వైపు ఈ ఘటనపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్విట్టర్ వేదికగా కవితను విమర్శిస్తూ పోస్ట్ పెట్టారు. ఛార్జిషీట్ లో లిక్కర్ క్వీన్ పేరును 28 సార్లు పేర్కొన్నారంటూ ట్వీట్ చేశారు. దీనిపై ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ ట్వీట్ చేశారు. రాజగోపాల్ అన్నా… తొందర పడకు.. మాట జారకు… 28 సార్లు నా పేరు చెప్పించినా.. 28 వేల సార్లు చెప్పించినా… అబద్ధం నిజం కాదు అంటూ కవిత స్పందించారు.
నిజం నిప్పులాంటిది చెల్లెమ్మ. నువ్వు లిక్కర్ స్కాం లో ఉన్నది నిజం, జైలుకి వెళ్లడం ఖాయం. నిన్ను మీ అన్న మీ నాయనా ఎవ్వరు కాపాడలేరు. మునుగోడు ఉప ఎన్నికలలో నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక @KTRTRS(#TwitterTillu) ఇంకా మీ తెరాస నాయకులు పారదర్శకరంగా టెండర్ ద్వారా వచ్చిన 18000 కోట్ల 1/2 https://t.co/xKfidkDslc
— Komatireddy Raj Gopal Reddy (@krg_reddy) December 21, 2022
కవిత స్పందించిన కాసేపటికే బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి మళ్లీ రీట్వీట్ చేశారు. నిజం నిప్పు లాంటిది చెల్లెమ్మా అంటూ రీ ట్వీట్ చేశారు. ‘‘నీవు లిక్కర్ స్కాం లో ఉన్నది నిజం.. జైలుకు వెళ్లడం ఖాయం. నిన్ను మీ నాయన, అన్నా ఎవరూ కాపాడలేరు. మునుగోడు ఉప ఎన్నికల్లో నన్ను నేరుగా ఎదుర్కోలేక పారదర్శకంగా వచ్చిన కోల్మైన్పై విష ప్రచారం చేశారు. నా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ప్రచారం చేశారు. రాబోయే రోజుల్లో మీ కుటుంబం సభ్యులు అంతా జైలుకు వెళ్లడం ఖాయం’’ అంటూ రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు.
రాజగోపాల్ అన్న ..
తొందరపడకు , మాట జారకు !!
" 28 సార్లు " నా పేరు చెప్పించినా
" 28 వేల సార్లు " నా పేరు చెప్పించినా
అబద్ధం నిజం కాదు.. #TruthWillPrevail https://t.co/476lW6fOTC— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 21, 2022