మళ్లీ తెరపైకి మాస్క్.. రద్దీ ప్రాంతాల్లో మాస్కులు ధరించాలని కేంద్రం ఆదేశాలు

ప్రపంచ దేశాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో కీలక నిర్ణయం తీసుకున్నారు. రద్దీ ప్రదేశాల్లో ప్రజలు కచ్చితంగా మాస్కులు ధరించాలని ఈ సమావేశం నిర్ణయంతీసుకుంది. ఇకపై ప్రతి వారం కరోనా పరిస్థితులను అధ్యయనం చేసేందుకు సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు. కరోనా ఇంకా ముగిసిపోలేదని, అప్రమత్తంగా వుండాలని మన్సుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా వుండాలని, నిఘాను పటిష్ఠం చేయాలన్నారు. ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా వున్నామని మన్సుఖ్ పేర్కొన్నారు.

Related Posts

Latest News Updates