ఏపీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ విషెస్ చెబుతున్నారు. అన్ని రాష్ట్రాల్లో, విదేశాల్లో ఆయన అభిమానులు, కేడర్ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సీఎం జగన్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షుతో వుండాలని ట్విట్టర్ వేదికగాఆకాంక్షించారు. ఇక… గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ జగన్నాథుడు మరియు వేంకటేశ్వరుడు మంచ ఆరోగ్యం, దీర్ఘాయువు ఇవ్వాలని ఆకాంక్షించారు. తమ నాయకత్వంలో ఏపీ పురోగమనం సాధించాలని ఆకాంక్షించారు. వీరితో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 50 వ పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ మీరు శాంతి, ఆరోగ్యం, ఆనందంతో వుండాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు.
Best wishes to Andhra Pradesh CM Shri @ysjagan Garu on his birthday. May he be blessed with a long and healthy life.
— Narendra Modi (@narendramodi) December 21, 2022
వీరితో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా సీఎం జగన్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో కూడా పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. సర్వమత ప్రార్థనలతో వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా 500 కిలోల కేక్ ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల, మంత్రి జోగి రమేష్, తదితరులు హాజరయ్యారు.
I extend my heartiest felicitations and warm greetings to Sri Y.S. Jagan Mohan Reddy, Chief Minister of Andhra Pradesh, on his 50th Birthday. pic.twitter.com/9ehsGYABOV
— Governor of Andhra Pradesh (@governorap) December 21, 2022













