ప్రజలు ప్రభుత్వానికి బకాయిలు చెల్లిస్తుంటారు. అధికారులు ప్రజలకు నోటీసులిస్తారు. కానీ.. స్మారక చిహ్నాలకు కూడా ట్యాక్సులు చెల్లించాలంటూ నోటీసులిస్తారా? అసలు అలా జరుగుతుందా? జరిగింది. నీటి పన్ను బకాయిలు కట్టాలంటూ… 15 రోజులు గడువు అంటూ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తాజ్ మహల్ కు నోటీసులు జారీ చేశారు. ఆస్తి, నీటి పన్ను బకాయిలు ఉన్నట్లు నోటీసులు ఇచ్చారు. లక్షా 40 వేల ఆస్తి పన్ను, కోటి రూపాయల నీటి పన్ను పెండింగ్ ఉన్నట్లు నోటీసులో వెల్లడించారు. పెండింగ్ లో ఉన్న ట్యాక్స్ లను పే చేయాలని నోటీసులో తెలిపారు.
పెండింగ్ ట్యాక్స్ చెల్లించేందుకు 15 రోజుల గడువు ఇచ్చారు. మున్సిపల్ అధికారులు జారీ చేసిన నోటీసును చూసి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు నోరెళ్లబెట్టారు. తాజ్ మహాల్ జాతీయ స్మారక చిహ్నమని…ఎలాంటి ట్యాక్స్ విధించడానికి వీల్లేదంటున్నారు. ఇది వైరల్ కావడంతో… ఏఎస్ఐ అధికారులు స్పందించారు. ఈ వ్యవహారంలో కార్పొరేషన్ అధికారులు పొరపాటు పడ్డారని, స్మారక చిహ్నాలకు పన్నులుండవని క్లారిటీ ఇచ్చారు.












