అలీ, నటుడు పవన్ కల్యాణ్ మధ్య స్నేహం ఎంత గాఢంగా వుంటుందో అందరికీ తెలిసిందే. దాదాపుగా పవన్ కల్యాణ్ సినిమాలో అలీ కనిపిస్తూ వుంటాడు. ఇద్దరి మధ్యా కొంత గ్యాప్ వచ్చిందని, రాజకీయాల పరంగా ఇద్దరి మధ్యా గ్యాప్ బాగా పెరిగిందని బాగా వైరల్ అయ్యింది. అసలు అలీతో పవన్ కల్యాణ్ మాట్లాడటమే లేదని కూడా వార్తలు వచ్చాయి. అయితే.. ఓ న్యూస్ ఛానల్ లో జరిగిన ఇంటర్వ్యూలో అలీ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. గ్యాప్ వుంటేగా… గ్యాప్ వచ్చేందుకు. గ్యాప్ కొందరు క్రియేట్ చేశారంటూ పేర్కొన్నాడు. తన కూతురు వివాహానికి కూడా పవన్ ను ఆహ్వానించానని గుర్తు చేశారు.

అయితే… పవన్ బయల్దేరాడని, విమానం ఆలస్యం కావడంతో రాలేదని తెలిపాడు. సినిమా సెట్ కి వెళ్లగానే… తనకు టీ, కాఫీ ఇవ్వండంటూ బాయ్ కి సూచన చేశాడని, తన కోసం పవన్ ఇతరులను కూడా పక్కన పెట్టి, 15 నిమిషాల సమయం కేటాయించాడని అలీ వెల్లడించాడు. ఇవేవీ బయటకు రావని, ఏమీ తెలియకుండా పుకార్లు క్రియేట్ చేస్తారని మండిపడ్డారు. ఏమీ తెలుసుకోకుండా కొందరు రాసేసుకుంటారని, ఏమీ చేయలేమన్నారు. తమ మధ్య ఎలాంటి గ్యాప్ లేదని అలీ ప్రకటించాడు.












