వారిని ఎంత ప్రశంసించినా తక్కువే … రాజ్ నాథ్ సింగ్

తమకు ఇతర దేశాల భూభాగాలను ఆక్రమించుకోవాలనే ఆలోచన లేదని భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన ఫిక్కీ 95వ వార్షిక సదస్సులో రాజ్ నాథ్ సింగ్  ప్రసంగిస్తూ  సరిహద్దుల్లో అనునిత్యం ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్న చైనాను ఉద్దేశించి రాజ్ నాథ్ పరోక్ష విమర్శలు గుప్పించారు. వాస్తవాల ఆధారంగా ఎవరైనా మాట్లాడాలని  అవాస్తవాలను ప్రచారం చేస్తూ రాజకీయాలు చేయడం సరికాదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి పరోక్ష విమర్శలు గుప్పించారు. ప్రపంచంలో అంత్యంత శక్తిమంతమైన దేశంగా ఎదగాలని తాము కోరుకోవడం లేదని, ప్రపంచ సంక్షేమం కోసం పని చేయాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. గాల్వాన్ అయినా, తవాంగ్ అయినా మన సైనిక బలగాలు శౌర్యపరాక్రమాలను నిరూపించుకుంటున్నాయన్నారు. వారు ప్రదర్శిస్తున్న ధైర్య, సాహసాలు ప్రశంసనీయమని కొనియాడారు. వారిని ఎంత ప్రశంసించినా తక్కువేనన్నారు. ప్రతిపక్షాల ఉద్దేశాలు ఏమిటో తాము ఎప్పుడూ ప్రశ్నించలేదని, వారి విధానాలనే ప్రశ్నిస్తున్నామని అన్నారు.

Related Posts

Latest News Updates