త్రిష నటించిన మూవీ రిలీజ్ కి డేట్ ఫిక్స్.. 30 న ”రాంగి” రిలీజ్

త్రిష నటించిన లేడీ నేపథ్యంలో వుండే మూవీ రాంగి. ఇది విడుదలకు సిద్ధమైపోయింది. డిసెంబర్‌‌‌‌ 30న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ‘జర్నీ’ ఫేమ్ శరవణన్ దీనికి దర్శకుడు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. మూడేళ్ళ క్రితమే షూటింగ్ పూర్తయింది. ట్రైలర్ కూడా అప్పుడే రిలీజ్ చేశారు. కానీ కరోనాతో విడుదల వాయిదా పడుతూ వచ్చింది. చివరికి తేదీని ప్రకటించారు. ఈ యాక్షన్ ఎంటర్‌‌‌‌ టైనర్‌‌‌‌కు స్డార్ డైరెక్టర్ మురుగదాస్‌‌ కథను అందించాడు. కొన్ని రోజుల క్రిందటే త్రిష ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తనను ఆదరిస్తున్న అభిమానులు, ఇతరులకు అందరికీ ధన్యవాదాలు ప్రకటించింది. ఇక ప్రస్తుతం మోహన్‌‌లాల్‌‌కు జంటగా ‘రామ్‌‌’ అనే మలయాళ చిత్రంలో ఆమె నటిస్తోంది.

Related Posts

Latest News Updates