మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఘోరం జరిగిపోయింది. వుడిపెల్లిలోని ఓఇళ్లు దగ్ధం కావడంతో మంటల్లో చిక్కుకొని ఆరుగురు సజీవ దహనమయ్యారు. చనిపోయిన వారిలో మాసు శివయ్య (50), ఆయన భార్య రాజ్యలక్ష్మి, శివయ్య వదిన కూతురు మౌనిక (35), హిమబిందు (4), స్వీటి (2), శాంతయ్య (సింగరేణి కార్మికుడు, మృతుడి బంధువు) మృతి చెందినట్టు సమాచారం. విషయం తెలుసుకున్న మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్, ఏసీపీ తిరుపతి రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. షార్ట్ సర్క్యూట్ తో జరిగిందా? లేదంటే ఏదైనా కుట్ర దాగుందా? అన్న కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు.