పద్ధతి మార్చుకోండి.. లేదంటే టిక్కెట్ ఇవ్వం : 32 మందికి సీఎం జగన్ మళ్లీ క్లాస్

గడప గడపకు మన ప్రభుత్వంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఎమ్మెల్యేలు, వైసీపీ నియోకవర్గ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, కోఆర్డినేటర్లు హాజరయ్యారు. గడప గడపకు అన్న కార్యక్రమాన్ని మార్చి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. 32 మంది ఎమ్మెల్యేలు తక్కువ రోజులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని, ఇదేం పద్ధతి అంటూ ఫైర్ అయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఎవ్వరూ నిర్లక్ష్యం చేయవద్దని, మార్చి నాటికి పూర్తి స్థాయి నివేదికలు తెప్పిస్తానని జగన్ తేల్చి చెప్పారు. ఈ 32 మంది ఎమ్మెల్యేలు వెంటనే పద్ధతి మార్చుకోవాలని, లేదంటే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు కష్టమేనని జగన్ హెచ్చరించారు. మళ్లీ గడపగడపకు మన ప్రభుత్వం వర్క్ షాప్ కార్యక్రమం 2023, మార్చి నెలలో నిర్వహించబోతున్నట్లు స్పష్టం చేశారు. ఆ సమయానికి వెనుకబడిన ఎమ్మెల్యేలంతా పని తీరు మార్చుకోవాలన్నారు.

సచివాలయాల కన్వీనర్లుగా ఎవర్ని నియమించుకుంటారన్నది స్థానిక ఎమ్మెల్యేల స్వేచ్ఛకే వదిలిపెడుతున్నామని జగన్ ప్రకటించారు. అయితే.. వారు సమర్థులై వుండాలని జగన్ నిబంధన విధించారు. వారికి తప్పనిసరిగా స్మార్ట్ ఫోన్ వుండాలని, ఆ 50 ఇళ్లకు సంబంధించిన వారు మాత్రమే అయి వుండాలన్న సూచన చేశారు. గడప గడపకూ మన ప్రభుత్వం అనేది నిర్దేశించిన విధంగానే జరగాలని, ప్రతి సచివాలయ పరిధిలో కనీసం 2 రోజుల పాటు, రోజుకు 6 గంటల పాటు తిరగాలన్నారు.

Related Posts

Latest News Updates