తెలంగాణలో బల్క్ డ్రగ్ పార్క్ ను ఏర్పాటు చేసుందుకే కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు లోక్ సభలో ఓ ప్రకటన చేసింది. తెలంగాణలో బల్క్ డ్రగ్స్ పార్కు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. పీఎస్ఐ స్కీంలో దేశంలో 3 చోట్ల బల్క్ ట్రక్ పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఒక్కో పార్కుకు 1000 కోట్ల నిధులు ఇస్తున్నట్లు కూడా ప్రకటించారు. 13 రాష్ట్రాల నుంచి తమకు దరఖాస్తులు వచ్చాయని, తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు కూడా తాము సుముఖంగా వున్నామన్నారు. తెలంగాణతో పాటు గుజరాత్, హిమాచల్ లో కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు.