హిమాచల్ ప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు ప్రతిభా సింగ్, ఆమె కుమారుడు, ఎమ్మెల్యే విక్రమాదిత్యపై రాజస్థాన్ లో గృహ హింస కేసు నమోదైంది. అత్తింటి వారు తనను వేధించారంటూ విక్రమాదిత్య భార్య సుదర్శన సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. కోడలు ఫిర్యాదు చేయడంతో విచారించేందుకు పోలీసులు ప్రతిభాసింగ్, విక్రమాదిత్యకు సమన్లు జారీ చేశారు. అయితే… అత్తింటి వారు మానసికంగా, శారీరకంగా తనను వేధించారని, విక్రమాదిత్య తన గదిలో సీసీటీవీ కెమెరాలు పెట్టారని కోడలు ఆరోపించింది.
తన మామ, మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ మరణించాక… తనను పుట్టింటికి పంపించేశారని, అంతేకాకుండా తన భర్త, ఎమ్మెల్యే విక్రమాదిత్యకు ఇతర మహిళలో వివాహేతర సంబంధం కూడా వుందని కోడలు సుదర్శన సంచలన ఆరోపణలు చేసింది. తన భర్త నుంచి తనకు భరణం ఇప్పించాలంటూ మరో కేసు కూడా దాఖలు చేశారు. మొన్నటి వరకూ హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికలు జరిగాయి. ఫలితాలు కూడా వచ్చి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ప్రతిభాసింగ్ పేరు ముఖ్యమంత్రి రేసులో ముందంజలో నిలిచింది కూడా.












