దేశ వ్యాప్తంగా విజయ దివస్ సంబరాలు… నేషనల్ వార్ మెమోరియల్ వద్ద నివాళుల అర్పించిన రాజ్ నాథ్

1971లో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో గెలిచి బంగ్లాదేశ్ కు విమోచన కల్పించిన సందర్భాన్ని పురస్కరించుకుని భారత్ లో నేడు విజయ్ దివస్ సంబరాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విజయ్ దివస్ సందర్భంగా నేషనల్ వార్ మెమోరియల్ వద్ద నివాళుల అర్పించారు. అప్పటి యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారికి నివాళులు అర్పించారు.

రాజ్ నాథ్ సింగ్ తో పాటు సీడీఎస్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే, త్రివిధ దళాధిపతులు కూడా యుద్ధ స్మారక చిహ్నం వద్ద పుష్ప గుచ్ఛాలు వుంచి నివాళులు అర్పించారు. ఇక… ఢిల్లీలోని ఆర్మీ హౌజ్ లో కూడా విజయ్ దివస్ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్, సీజేఐ, త్రివిధ దళాల అధిపతులు, అధికారులు పాల్గొన్నారు.

Related Posts

Latest News Updates