తెలంగాణ సీఎం కేసీఆర్ కి ప్రజాస్వామ్యంపై ఏమాత్రం నమ్మకమే లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. తెలంగాణలో ఆయన పాలనకు గుడ్ బై చెప్పే రోజు వచ్చేసిందని, అదే సమయంలో బీజేపీ అధికారంలోకి వచ్చే సమయం ఆసన్నమైందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ఐదో విడత ముగింపు సభ కరీంనగర్ లో జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా జేపీ నడ్డా హాజరయ్యారు. కుటుంబవాదాన్ని వ్యాపింపజేసే ప్రయత్నంలో భాగంగానే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టారని వ్యాఖ్యానించారు. దర్యాప్తు సంస్థలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎందుకు విచారిస్తున్నయ్ అని నడ్డా ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులంతా కలిసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు.

బీఆర్ఎస్ రానున్న రోజుల్లో వీఆర్ఎస్ గా మారి అంతరించిపోతుందని జేపీ నడ్డా ఎద్దేవా చేశారు. బండి సంజయ్ పాదయాత్ర 1403 కిలోమీటర్లు పూర్తి చేసుకొని, కరీంనగర్ కు చేరుకున్నారని తెలిపారు. ఇక్కడితో ఇది ఆగే యాత్ర కాదని… ఈ యాత్ర కొనసాగుతుందని, సాలు దొర.. సెలవు దొర అంటూ ముందుకు సాగుతామని ప్రకటించారు. కేంద్రం నుంచి జాతీయ రహదారుల కింద భారీ ఎత్తున నిధులు మంజూరు చేశామని, జల్ జీవన్ మిషన్ కింద భారీగా నిధులు ఇచ్చామని ప్రకటించారు. కానీ.. మిగులు బడ్జెట్ వున్న రాష్ట్రాన్ని.. సీఎం కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చిపడేశారని అన్నారు. కేసీఆర్ పాలనలో 3.29 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చేశారని మండిపడ్డారు.

బీజేపీ యాత్రను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ వాళ్లు ప్రయత్నించారని జేపీ నడ్డా గుర్తు చేశారు. టీఆర్ఎస్ నేతలకు తాను ఒక్కటే చెప్పదల్చుకున్నానని… ఇది ప్రజాస్వామ్యమని, దీనిలో ఇతరుల గొంతు నొక్కే ప్రయత్నం జరగకూడదని అన్నారు. ఒకవేళ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్న విషయాన్ని కేసీఆర్ తెలుసుకోవాలని చురకలంటించారు. అన్నివర్గాల సంక్షేమం కోసమే బీజేపీ పాటుపడుతోందని తెలిపారు.