వివాదంలో ఇరుక్కున్న షారూఖ్ ”పఠాన్” మూవీ… బాయ్ కాట్ చేస్తామని హిందువుల హెచ్చరికలు

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ మూవీ పఠాన్ తీవ్రమైన వివాదాల్లో ఇరుక్కుంది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ పాట బేషరమ్ రిలీజ్ అయ్యింది. ఈ సాంగ్ లో హీరోయిన్ దీపికా పదుకొనే కాషాయ రంగు బికినీలో కనిపిస్తుంది. దీనిపైనే హిందువులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ బికినీ రంగు వల్ల తమ మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని, వెంటనే మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే సినిమాను బాయ్ కాట్ చేస్తామని స్పష్టం చేస్తున్నారు. హిందువుల మనోభావాలను ఈ సినిమా దెబ్బతీసిందని, అందుకే ఈ సినిమాను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇక మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా ఘాటుగానే స్పందించింది. ఆ రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా సైతం ఈ అభ్యంతరకర సన్నివేశాలను తొలిగిస్తే తప్ప ఈ సినిమాకు అనుమతి ఇవ్వమని స్పష్టం చేశారు. లేదంటే నిషేధం తప్పదని హెచ్చరించారు. ఈ సినిమాలో కొన్ని అభ్యంతరకర సీన్లు వున్నాయని, ఈ సీన్లను మార్చకుంటే రాష్ట్రంలో మూవీని బ్యాన్ చేస్తామని స్పష్టం చేస్తున్నారు. కొన్ని చోట్ల షారూఖ్ దిష్టిబొమ్మలను కూడా దహనం చేస్తున్నారు.

Related Posts

Latest News Updates