ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి బాల సరస్వతి ఇవాళ మధ్యాహ్నం కన్నుమూశారు. వయసు రిత్యా అనారోగ్య సమస్యల వల్ల కిమ్స్ ఆసుపత్రిలో గత మూడు రోజులుగా చికిత్స పొందుతున్న ఆమె.. ఇవాళ తుది శ్వాస విడిచారు. రాజమౌళికి కీరవాణి తల్లి పిన్ని అవుతారు. రాజమౌళిని ఆమె ఎంతో ఆప్యాయంగా చూసుకుంటారు. రాజమౌళికి కూడా పిన్ని అంటే ఎంతో ఇష్టం. అందుకే ఆమె మృతదేహాన్ని రాజమౌళి ఇంటికి తరలిస్తున్నారు.












