కాచిగూడలోని ఏషియన్ తారకరామ థియేటర్ ను బాలకృష్ణ పున: ప్రారంభించారు. దీనిని తారకరామా సినీఫ్లెక్స్ ను ఏషియన్ వారు తీసుకొని పున: నిర్మించారు. అవతార్ సినిమాతో నందమూరి వారి కొత్త థియేటర్ అందుబాటులోకి రానుంది. సంక్రాంతికి ఈ థియేటర్లో బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమా ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు. సినిమాల్లో ఎన్నో ప్రయోగాలు చేసిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని.. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ ఎన్నో మార్పులు తెచ్చారన్నారు.

అమ్మ, నాన్నల పేర్లు కలిసి వచ్చేటట్లు ఈ థియేటర్ కు పేరు పెట్టారని తెలిపారు. ఈ థియేటర్ లొనే తన అబ్బాయికి మోక్షజ్ఞ అని పేరు పెట్టామని అన్నారు. ఇక్కడికి వస్తే పాత రోజులు గుర్తొస్తాయని తెలిపారు. ఈ థియేటర్ లో అందరికి అందుబాటు ధరల్లోనే టికెట్స్ ఉంటాయన్నారు. ప్రేక్షకులు థియేటర్ లలో సినిమా చూడ్డానికి ఎక్కువగా ఇష్టపడతారని బాలయ్య చెప్పారు.












