తానా ఆధ్వర్యంలో విశాఖలో వీల్ చైర్ క్రికెట్ పోటీలు… విన్నర్స్ గా కర్నాటక టీమ్

గీతం డీమ్డ్ యూనివర్శిటీలో తానా ఆధ్వర్యంలో దివ్యాంగుల కోసం నిర్వహిస్తున్న సౌత్ ఇండియా వీల్ చైర్ క్రికెట్ పోటీలు ముగిశాయి. ఈ పోటీలలో విన్నర్స్ గా కర్నాటక జట్టు, రన్నర్స్ గా తమిళనాడు జట్టు నిలిచింది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) తానా చైతన్య స్రవంతి పేరుతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే విశాఖపట్నం గీతం ఇంజినీరింగ్ కాలేజీలో సౌత్ ఇండియా వీల్ చైర్ క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. ఆదివారం ఆంధ్రా, కర్నాటక జట్ల మధ్య వీల్ చైర్ క్రికెట్ పోటీలు జరిగాయి. వర్షం కారణంగా ఈ మ్యాచ్ ను 18 ఓవర్లకే కుదించారు.

ముందుగా బ్యాటింగ్ చేసిన కర్నాటక జట్టు 18 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఆంధ్ర జట్టు కేవలం 18 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి, 133 పరుగులు సాధించింది. విజేతలను తానా క్రీడా విభాగం కో ఆర్డినేటర్ శశాంక్ యార్లగడ్డ అభినందించారు. తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ, తానా కార్యదర్శి వేమూరి సతీష్, చైతన్య స్రవంతి ఇంచార్జ్ సునీల్ పంత్ర, మహిళా విభాగం అధ్యక్షురాలు ఉమా కటికి తదితరులు ఈ ముగింపు ఉత్సవానికి హాజరయ్యారు.

Related Posts

Latest News Updates