అమెరికాలో స్వలింగ సంపర్కుల వివాహాలకు రక్షణ కల్పించే బిల్లు (సేమ్ సెక్స్ మ్యారేజ్ ప్రొటెక్షన్ బిల్) చట్టరూపం దాల్చింది. ఇప్పటికే అమెరికా సెనేట్లో, ప్రతినిధుల సభలో ఆమోదం పొందిన ఆ బిల్లుపై మంగళవారం అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు. దాంతో బిల్లు చట్టంగా మారింది.
ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బైడెన్.. ‘ఇది చాలా సంతోషకరమైన రోజు. ఇవాళ అమెరికా సమానత్వం దిశగా మరో అడుగు వేసింది. స్వేచ్ఛ, న్యాయం కొందరికే సొంతం కాదు, అందరికీ అనే దిశగా మరో నిర్ణయం తీసుకుంది. ఏ విధంగానంటే, ఇవాళ నేను సేమ్ సెక్స్ మ్యారేజ్ ప్రొటెక్షన్ బిల్లుపై సంతకం చేశాను’ అని ట్వీట్ చేశారు.