సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను అంతర్జాతీయ ప్రమాణాలు, ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందు కోసం 699 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఆధునికీకరణ 2025 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. ఈ నిర్మాణ పనులను ఐఐటీ ఢిల్లీకి రైల్వేశాఖ అప్పగించింది. భవన నిర్మాణం, అంతర్జాతీయ ప్రమాణాల రూపకల్పనకు కన్సల్టెంట్ గా ఐఐటీ ఢిల్లీని నియమించామని, వారికే బాధ్యతలు అప్పగించామని దక్షిణ మధ్య రైల్వే పీఆర్వో ప్రకటించారు. ఇప్పటికే క్షేత్ర స్థాయి పనులు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు. మొదటి దశలో రైల్వే స్టేషన్ భవనాన్ని ఎలా చేపట్టాలన్న విషయంపై తుది రూపు ఇచ్చేందుకు లీడ్ డిజైన్ డెరెక్టర్, సేఫ్టీ, ప్రూఫ్ కన్సల్టెంట్ లను అధికారులు నియమించారు.