చైనా నుంచి కాంగ్రెస్ కి డబ్బులు ముట్టాయి : కేంద్ర హోంమంత్రి అమిత్ షా

కేంద్ర హోంమంత్రి కాంగ్రెస్ పై సంచలన ఆరోపణలు చేశారు. చైనా రాయబారుల నుంచి కాంగ్రెస్ నేతలు డబ్బులు తీసుకున్నారని, ఆ డబ్బులను రాజీవ్ గాంధీ ఫౌండేషన్ లో ఖర్చు చేశారని ఆరోపించారు. 2006-07 సంవత్సరంలో చైనా ఎంబసీ నుంచి రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు 1.35 కోట్లు అందాయని, అది ఎఫ్సీఆర్ఏ నిబంధనల ప్రకారం సరైనది కాదని వివరించారు. నిబంధనల ప్రకారమే రాజీవ్ గాంధీ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ ను హోంశాఖ రద్దు చేసిందని గుర్తు చేశారు.

సరిహద్దులో చైనా సైనికుల ఘర్షణపై పార్లమెంట్ లో విపక్షాల ఆందోళనపై అమిత్ షా ఘాటుగా స్పందించారు. 1962 లో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని, అయితే మోదీ పాలనలో ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేదని ప్రకటించారు. చైనాకు ఒక్క అంగుళాన్ని కూడా వదిలేది లేదన్నారు. సరిహద్దు ఘర్షణపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటన చేసినా… కాంగ్రెస్ సభలో అడ్డంకులు స్రుష్టించిందని మండిపడ్డారు. తాము సమాధానం ఇచ్చేందుకు రెడీగా వున్నామని, అయితే కాంగ్రెస్ గొడవకు దిగిందని అన్నారు.

Related Posts

Latest News Updates