రష్మిక ఇన్‌స్టా అకౌంట్ హ్యాంగ్ అయ్యిందా…? క్లారిటీ ఇచ్చిన రష్మిక మందన్న

సోషల్ మీడియాలో అందునా ఇన్‌స్టాగ్రామ్ లో నిత్యం యాక్టివ్ గా వుండే రష్మిక మందన్న అకౌంట్ హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని రష్మిక ఫ్యాన్స్ గుర్తించారు. ఇన్ స్టా బయోలో రష్మిక పేరును రివర్స్ ఆర్డర్లో రాసి వుంది. దీనిని అభిమానులు గుర్తించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే.. ఈ విషయంపై రష్మిక వెంటనే స్పందించింది. ఫ్యాన్స్ ఆందోళన చెందక్కర్లేదని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. తన అకౌంట్ ఏమీ హ్యాక్ అవ్వలేదని ఒక సోషల్ కాజ్ కోసం తన బయోలో పేరు మార్చినట్లు తెలిపింది. దీనికి కారణం వివరిస్తూ.. దేశంలో బాలిక విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో ప్లం ప్రాజెక్ట్ బ్లాక్ బోర్డ్ అనే ప్రచారంలో పాల్గొంటున్నట్టు, దానికి మద్దతుగానే ఇన్‌స్టా బయోలో పేరు మార్చినట్లు వెల్లడించింది.

Related Posts

Latest News Updates