మైత్రీ మూవీ మేకర్స్ కు గట్టి షాక్ తగిలింది. మైత్రీ మూవీస్ కార్యాలయంలో ఐటీ సోదాలు చేస్తోంది. సంస్థ లావాదేవీలు, సినిమా బడ్జెట్ కు సంబంధించిన సంస్థ సరిగ్గా లెక్కలు చూపించలేదని ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏక కాలంలో 15 చోట్ల ఐటీ సోదాలు చేస్తోంది. శ్రీమంతుడు, జనతా గ్యారేజీ, రంగస్థలం, సర్కారు వారి పాట, పుష్ప ది రైజ్ చిత్రాలను నిర్మించింది. ప్రస్తుతం ఈ సంస్థ వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలను నిర్మిస్తోంది.












