ఎమ్మెల్సీ అనంతబాబుకి షరతులతో కూడిన బెయిల్ ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. బెయిల్ షరతులు ట్రయల్ కోర్టు నిర్దేశిస్తుందని సుప్రీం కోర్టు పేర్కొంది. అనంతబాబు బెయిల్ పిటిషన్ పై నేడు సుప్రీంలో విచారణ జరిగింది. దళితుడు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు ప్రధాన నిందితుడిగా వున్నారు. ప్రస్తుతం అనంతబాబు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులో వుంటున్నారు. తదుపరి విచారణకు మార్చి 14 కి సుప్రీం కోర్టు వాయిదా వేసింది.












