హిమాచల్ ప్రదేశ్ 15వ ముఖ్యమంత్రిగా సుఖ్విందర్ సింగ్ సుఖు ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం మాజీ సీఎల్పీ నేత ముఖేశ్ అగ్నిహోత్రి చేత ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా, కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్ ఇన్‌ఛార్జ్ రాజీవ్ శుక్లా, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్, సీనియర్ నాయకుడు సచిన్ పైలట్ హాజరయ్యారు.












