పవన్ కల్యాణ్ పై మంత్రి రోజా సెటైర్ వేశారు. ఎన్నికల ప్రచారం కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ తయారు చేయించిన వారాహిపై కామెంట్స్ చేశారు. అది వారాహి కాదని, అది నారాహి అంటూ మంత్రి రోజా ఎద్దేవా చేశారు. పవన్ వాహనం రంగు, ఆయన వేసుకును చొక్కా కలర్ గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదని, ఆయన కలర్ పసుపు అని అందరికీ అర్థమైపోయిందని విమర్శించారు. కత్తులు పట్టుకొని పిచ్చి పిచ్చి ట్వీట్లు చేయడం రాజకీయాల్లో సరైన పద్ధతి కాదన్నారు.
ఆయన ఎన్నికల ప్రచార వాహనంపై తమ పార్టీ వారు ఎలాంటి కామెంట్స్ చేయలేదని, కొన్ని మీడియా సంస్థలే దానిని హైలెట్ చేశాయని ఆరోపించారు. అయినా… నిబంధనల ప్రకారం ఆర్మీ వాళ్లు మాత్రమే ఆ కలర్ వాడాలన్న నిబంధన వుందని గుర్తు చేశారు. పవన్ ని చూసే తాము భయపడటం లేదని, ఇక ఆయన వాహనాన్ని చూసి భయపడతామా? అంటూ నాదెండ్లకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. ఒంటరిగా అన్ని సీట్లలో పోటీ చేసే దమ్ము పవన్ కి వుందా? అంటూ రోజా సవాల్ విసిరారు. జగన్ దమ్మున్న నేత అని, ఒంటరిగానే 175 స్థానాల్లో నిలబడతారని రోజా అన్నారు.












