హిమాచల్ సీఎంగా సుఖ్విందర్ సింగ్ సుఖూ.. ఎంపిక చేసిన అధిష్ఠానం

హిమాచల్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్ఠానం సుఖ్విందర్ సింగ్ సుఖూను ఎంపిక చేసింది. శనివారం సాయంత్రం జరిగే సీఎల్పీ సమావేశంలో సుఖ్విందర్ పేరును సీఎం అభ్యర్థిగా ప్రకటించనున్నారు. ఆదివారం సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయున్నారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నాదౌన్ నుంచి బరిలోకి దిగారు. ఇక.. డిప్యూటీ సీఎంగా ముకేశ్ అగ్నిహోత్రిని ఎంపిక చేశారు. గతంలో అగ్నిహోత్రి సీఎల్పీ నేతగా పనిచేశారు.

 

అయితే…. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత మాజీ సీఎం వీరభద్రసింగ్ భార్య ప్రతిభా సింగ్ సీఎం రేసులో ముందు వరుసలో నిలిచారు. చాలా ఏళ్లుగా వీరభద్ర సింగ్ కాంగ్రెస్ లో సేవలందించారు. రాష్ట్రంతో పాటు పార్టీపై కూడా చాలా పట్టు సాధించారు. ఈ నేపథ్యంలోనే ప్రతిభా సింగ్ పేరును అధిష్ఠానం సూచిస్తుందని పుకార్లు వచ్చాయి. కానీ… చివరి నిమిషంలో అధిష్ఠానం సుఖ్విందర్ సింగ్ సఖూను ఎంపిక చేసింది.

Related Posts

Latest News Updates