ప్రభుత్వ ఉపాధ్యాయులకు జగన్ సర్కార్ తీపి కబురు చెప్పింది. ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహించేందుకు ఓకే చెప్పింది. దీనిపై ఈ నెల 12 తేదీన ఓ ప్రకటన చేయనున్నారు. ఆ తర్వాత నెల రోజుల్లోనే టీచర్ల బదిలీల ప్రక్రియ పూర్తయ్యేలా అధికారులు ప్లాన్ సిద్ధం చేశారు. ఎలాంటి విమర్శలు రాకుండా ఆన్ లైన్ ద్వారానే బదిలీ ప్రక్రియ జరిగేలా సిద్ధమయ్యారు. 5 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న హెచ్ఎంలు, 8 సంవత్సరాలు ఒకే చోట వున్న ఉపాధ్యాయులకు మాత్రం కచ్చితంగా బదిలీ అవతుంది. ఎలాంటి సర్వీసు లేకుండానే బదిలీలకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం ఇచ్చింది. ఇక… వచ్చే నెల 12 కల్లా బదిలీల తుది జాబితా విడుదల కానుంది.












