నాలో కొత్త యాంగిల్ చూస్తారు.. ”వాల్తేరు వీరయ్య”పై రవితేజ ట్వీట్

మాస్ మహారాజా అంటే రవితేజ అని ఠక్కున గుర్తొస్తాడు. ఇప్పుడు సినిమాలతో చాలా బిజీ అయ్యాడు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య లో కూడా మాస్ మహారాజా రవితేజ కీ రోల్ లో నటిస్తున్నాడు. అందులో చిరంజీవి లుక్స్ అందరికీ తెలిశాయి. కానీ… రవితేజ లుక్స్ ఇప్పటి వరకూ ఎవ్వరికీ తెలియదు. రవితేజ హఠాత్తుగా తన లుక్ గురించి ట్వీట్ చేశాడు.

”మీరంతా దీని (అప్‌డేట్)కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు. మీ అందరికీ నాలో ఉన్న కొత్త వ్యక్తిని డిసెంబర్‌ 12న ఉదయం 11:07 గంటలకు పరిచయం చేస్తున్నా..” అని ట్వీట్ చేశారు. సిలిండర్‌ను గొడ్డలితో లాక్కెళ్తూ ఉన్న స్టిల్‌ను షేర్ చేయగా.. నెట్టింట హల్‌ చల్ చేస్తోంది. ఈ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కు బాబీ (కేఎస్ ర‌వీంద్ర‌) దర్శకత్వం వహిస్తున్నాడు.

https://twitter.com/RaviTeja_offl/status/1601163496045121537?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1601163496045121537%7Ctwgr%5E1cd072f450d89d004bbb19ec9eb17539ea57494f%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.ntnews.com%2Fcinema%2Ftollywood-hero-ravi-teja-gives-waltair-veerayya-update-876170

Related Posts

Latest News Updates