చాలా కాలం తర్వాత పవన్ మార్షల్ ఆర్ట్స్… సోషల్ మీడియాలో వైరల్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్… అటు రాజకీయాలు, ఇటు సినిమా రంగంలో వున్నారు. ఇంతేకాకుండా ఆయనలో మరో కోణం కూడా వుంది. ఖుషీ, తమ్ముడు సినిమాల్లో కనిపించింది కూడా. పవన్ కి చిన్నతనం నుంచే మార్షల్ ఆర్ట్స్ అంటే ఇష్టం. మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ కూడా తీసుకున్నాడు. తన ప్రావీణ్యాన్ని పలు సినిమాల ద్వారా ప్రేక్షకులకు కూడా తెలియజేశాడు. అయితే.. సినిమాలు, రాజకీయాల్లో బిజీ బిజీ అయిన పవన్… ఈ మధ్య మార్షల్ ఆర్ట్స్ వైపు అంతగా మొగ్గు చూపలేదు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత పవన్ మళ్లీ… మార్షల్ ఆర్ట్స్ పై ద్రుష్టి నిలిపాడు. తాజాగా మార్షల్ ఆర్ట్స్ పై పవన్ చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.

ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ ‘హరి హర వీరమల్లు’ సినిమా చేస్తున్నాడు. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్‌ జరుపకుంటుంది. ఈ చిత్రంలో పవన్‌ మల్లయోధుడిగా కనిపించనున్నాడు. ఈ క్రమంలో కత్తిసాము, గుర్రపు స్వారీ వంటి అంశాలపై పట్టు తెచ్చుకున్నాడు. కాగా తాజాగా ఈ సినిమా కోసం మార్షల్‌ ఆర్ట్స్‌ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టాడు. దీనికి సంబంధించిన ఫోటోను పోస్ట్‌ చేస్తూ రెండు దశాబ్ధాల తర్వాత మార్షల్‌ ఆర్ట్స్‌ ప్రాక్టీస్‌ను ప్రారంభించానని తెలిపాడు. పవన్‌ షేర్‌ చేసిన ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది.

Related Posts

Latest News Updates