గుజరాత్ శాసనసభా పక్ష నేతగా భూపేంద్ర పటేల్… ఈ నెల 12 న ప్రమాణం

బీజేపీ శాసనసభాపక్ష నేతగా గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యేలు భూపేంద్ర పటేల్ ను ఎన్నుకున్నారు. దీంతో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఈ నెల 12 న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తమ శాసనసభా పక్ష నేతను ఎన్నుకునేందుకు శనివారం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలందరూ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కర్నాటక మాజీ సీఎం యడియూరప్ప, కేంద్ర మంత్రి అర్జున్ ముండా హాజరయ్యారు. ఈ సమావేశంలోనే తమ శాసనసభా పక్ష నేతగా భూపేంద్ర పటేల్ ను ఎన్నుకున్నారు. ఇక… ఈ నెల 12 న నూతన సీఎం ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతున్నారు.

Related Posts

Latest News Updates