గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కి అందజేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 156 స్థానాలను కైవసం చేసుకొని, రికార్డుల్లోకెక్కింది. ఈ నేపథ్యంలో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే క్రమంలో… సీఎం భూపేంద్ర పటేల్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ నెల 12 తిరిగి నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో పాటు బీజేపీ అగ్రనేతలు హాజరవుతున్నారు.
ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఆయన మంత్రివర్గం రాజీనామాలను గవర్నర్ ఆమోదించారని గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు పంకజ్ దేశాయ్ ప్రకటించారు. కొత్త ప్రభుత్వం వచ్చే వరకూ ఆపద్ధర్మ సీఎంగా భూపేంద్ర పటేల్ కొనసాగుతారని తెలిపారు. ఇక.. శాసనసభా పక్ష నేతను ఎన్నుకునేందుకు శనివారం బీజేపీ ఎమ్మెల్యేలు పార్టీ కార్యాలయంలో సమావేశమవుతారని తెలిపారు. తమ నూతన శాసనసభా పక్ష నేత పేరును గవర్నర్ కి సూచిస్తామని తెలిపారు.












