మాండూస్ తుపాను కారణంగా తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి జిల్లాలోని నగరి, విజయపురం, నిండ్ర, పుత్తూరు, వడమాలపేటతో సహా మరికొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులు, వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు జిల్లాలకు చెందిన విద్యా సంస్థలకు కలెక్టర్లు సెలవులు ప్రకటించారు. కచ్చితంగా సెలవులు పాటించాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక… తుపాన్ నేపథ్యంల ప్రజలు ఇళ్లల్లోనే వుండాలని సూచించారు. అత్యవసరమైతేనే బయటకు రావాలన్నారు. మధ్యాహ్నం నుండి 10 వతేది రాత్రి వరకు తుఫాన్ నేపథ్యంలో ఈదురుగాలులు ఎక్కువగా ఉన్నందున, ప్రజలు అత్యవసర సమయాల్లో మాత్రమే బయటికి రావాలి జిల్లాల కలెక్టర్లు సూచించారు.

ఇక… ఒంగోలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని కలెక్టర్ ప్రకటించారు. ప్రజలు కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్ 1077 లేదా 08592-281400 నంబర్ కి ఫోన్ చేసి ఎటువంటి సమాచారం అయినా అందించవచ్చి లేదా సహాయం అయినా పొందవచ్చన్నారు. ఇక… అధికారులు స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు తుఫాన్ కదలికల పర్యవేక్షిస్తున్నారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్,ఎస్టీఆర్ఎఫ్ బృందాలను అధికారులు రంగంలోకి దించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్రతుఫానుగా మాండుస్ కొనసాగుతోందని, గడిచిన 6గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా గంటకు 12KMs వేగంతో కదులుతోందని అధికారులు ప్రకటించారు.












