”వారాహి” ప్రచార రథంపై వైసీపీ విమర్శలు… కౌంటర్ ఇచ్చిన జనసేన పవన్ కల్యాణ్

ఏపీలో ఎన్నికల ప్రచారం కోసం జనసేన అధినేత వారాహి అన్న పేరుతో తన ఎన్నికల ప్రచార రథాన్ని సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే… ఈ వారాహికి వేసిన రంగుపై వైసీపీ అభ్యంతరాలు, విమర్శలు చేయడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్నినాని విమర్శలు చేశారు. దీనికి జనసేన అధినేత పవన్ నేరుగా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. దీంతో ఇరు పార్టీల మధ్య మళ్లీ మాటల యుద్ధం ప్రారంభమైంది.

ఈ విషయంపై మాజీ మంత్రి పేర్నినాని మాట్లాడుతూ… మిలటరీ వాహనాలకు వాడే ఆలివ్ గ్రీన్ రంగును ప్రైవేట్ వాహనాలకు ఉపయోగించడం నిషిద్ధమని చట్టం స్పష్టంగా చెబుతోందని అన్నారు. అదే రంగు వుంటే రిజిస్ట్రేషన్ అవ్వదని, అందుకే ఏదో రంగు మార్చాలని, అందుకే పసుపు రంగు వేసుకోండని ఎద్దేవా చేశారు. ఎలాగూ మీరు టీడీపీతో ప్రయాణించేవారే కదా? అంటూ నాని చురకలంటించారు. ఇలాంటి వాహనాలు సినిమాలకు పనికొస్తాయని నాని విమర్శించారు.

అయితే మాజీ మంత్రి పేర్నినాని వ్యాఖ్యలకు జనసేన అధినేత పవన్ కౌంటర్ ఇచ్చారు. తొలుత తన సినిమాలను అడ్డుకున్నారని, విశాఖ వెళితే హోటల్ నంచి బయటికి రాకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. ఇక శ్వాస తీసుకోవడం కూడా ఆపేయమంటారా? అంటూ పవన్ ట్వీట్ చేశారు. మంగళగిరిలో తన కారు వెళ్తుంటే అడ్డుకున్నారని, ఇప్పటం గ్రామం విషయంలోనూ వివాదం రేపారని, ఇప్పుడు తన కారు రంగు విషయాన్ని కూడా రాద్ధాంతం చేస్తున్నారని పవన్ మండిపడ్డారు.

Related Posts

Latest News Updates