మెట్రో రెండో దశకు సీఎం కేసీఆర్ మరి కాసేపట్లో శంకు స్థాపన చేయనున్నారు. నాగోల్- రాయదుర్గం కారిడార్ 3 కి కొనసాగింపుగా రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకూ నిర్మించే ఎక్స్ ప్రెస్ మెటరోకు మైండ్ స్పేస్ వద్ద సీఎం శంకుస్థాపన చేయనున్నారు. రూ.6,250 కోట్ల వ్యయంతో 31 కిలోమీటర్ల పొడవున ఈ లైన్‌ను నిర్మిస్తారు. దీంతో శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లేవారికి సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఈ శంకుస్థాపన కార్యక్రమం ముగిసిన తర్వాత అప్పా కూడలి వద్ద జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ సభలో 30 వేల మంది పాల్గొంటారు.
మైండ్‌స్పేస్-శంషాబాద్ మెట్రో లైన్ పనులను హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్ ఆధ్వర్యంలో చేపడుతున్నారు. మూడేళ్లలో దీన్ని పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మెట్రో మార్గంలో టౌన్‌షిప్ లు, ప్రయాణీకుల రద్దీ ఆధారంగా స్టేషన్లను నిర్మిస్తారు.
మైండ్‌స్పేస్ తర్వాత బయోడైవర్సిటీ, నానక్‌రామ్‌గూడ, నార్సింగి, తెలంగాణ పోలీస్ అకాడమీ, రాజేంద్రనగర్, శంషాబాద్ టౌన్, ఎయుర్‌పోర్టు కార్గోస్టేషన్, టర్మినల్ వద్ద స్టేషన్లను నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఓఆర్‌ఆర్ నిర్మించిన సమయంలోనే రైట్ ఆఫ్ వే ఉన్నందున, మెట్రో పనులకు ఎలాంటి అడ్డంకులు ఉండవని అధికారులు భావిస్తున్నారు.