గుజరాత్ లో ఓటమికి ఒవైసీయే కారణం…. కస్సుమన్న కాంగ్రెస్

గుజరాత్ లో కాంగ్రెస్ ఘోర వైఫల్యం చెందింది. 182 స్థానాలున్న అసెంబ్లీ సీట్లలో కేవలం 17 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. దీంతో కేడర్ తీవ్ర నిరాశ చెందింది. అయితే… తాము ఎందుకు ఓడామో.. కాంగ్రెస్ వివరించింది. తమ ఓటమికి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీయే కారణమని కాంగ్రెస్ పేర్కొంది. ఒవైసీ వల్లే తమ ఓట్లు చీలాయని, అందుకే తాము పరాజయం పాలయ్యామని పేర్కొంది. ఇక… సీనియర్ నేత శశిథరూర్ కూడా వెరైటీగా స్పందించారు.‘గుజరాత్‌లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున నేను ప్రచారం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ క్యాంపెయినర్ల జాబితాలో కూడా నేను లేను. ఎన్నికల్లో ఎలాంటి పాత్ర పోషించని నేను పార్టీ ఓటమిపై స్పందించడం చాలా కష్టం’అని వ్యాఖ్యానించారు.

Related Posts

Latest News Updates