మాస్ మహారాజా.. రవితేజ డబుల్ రోల్ లో నటిస్తున్న చిత్రం ధమాకా. త్రినాథ్ రావు నక్కిన ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ పనులను చేసుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమాకి చెందిన మేకర్స్ పోస్టర్లు, టీజర్ ను రిలీజ్ చేశారు. దీంతో ఆశలు పెరిగిపోయాయి. తాజాగా ఈ చిత్రంలోని ”దండకడియాల్” లిరికల్ సాంగ్ రిలీజైంది. రవితేజ ఎనర్జిటిక్ స్టెప్స్ ఫ్యాన్స్‌లో జోష్ నింపుతున్నాయి. భీమ్స్ సిసిరోలియో స్వర పరిచిన ఈ పాటను భీమ్స్‌తో పాటు సాహితి, మంగ్లీ ఆలపించారు.

అంతేకాకుండా ఈ పాటకు భీమ్స్ స్వయంగా సాహిత్యం అందించాడు. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పాటలన్ని చార్ట్ బస్టర్‌లుగా నిలిచాయి. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. రవితేజకు జోడీగా పెళ్ళి సందడి ఫేం శ్రీలీల నటిస్తుంది. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ-స్క్రీన్‌ప్లే-మాటలు అందిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న రిలీజ్ కానుంది.












