ప్రపంచంలో శక్తిమంతమైన జాబితాలో నిర్మలా సీతారామన్ కి చోటు

ప్రపంచంలో 100 మంది శక్తిమంతమైన మహిళల జాబితాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి చోటు దక్కింది. ఆమెతో పాటు ఆరుగురు భారతీయ మహిళలకు కూడా చోటు దక్కింది. ఫోర్బ్స్ ప్రపంచంలో 100 మంది శక్తిమంతమైన మహిళల జాబితాను విడుదల చేసింది. అందులో 36 వ స్థానంలో నిర్మలా సీతారామన్ నిలిచారు. ఈమెతో పాటు బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కిరణ్ మజుందార్ షా, నైకా వ్యవస్థాపకుడు ఫల్గుణి నాయర్ తో కలిసి మొత్తం ఆరుగురు భారతీయులకు చోటు దక్కింది.

 

కిరణ్ మజుందార్ షా కి 72 వ ర్యాంక్, ఫల్గుణి నాయర్ కి 89 వ ర్యాంక్, హెచ్ సీఎల్ టెక్ చైర్ పర్సన్ రోష్నీ నాడార్ కి 53 వ ర్యాంక్, సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్ పర్సన్ మదాబి పూరి బుచ్ కి 54 వ ర్యాంక్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్ పర్సన్ సోమా మోండల్ కి 67 వ ర్యాంక్ లభించింది. అయితే… ఫోర్బ్స్ జాబితాలో నిర్మలా సీతారామన్ కి చోటు దక్కడం ఇది నాలుగో సారి.

Related Posts

Latest News Updates