మాండూస్ తుపాను హెచ్చరికలు… మూడు రోజుల పాటు ఏపీలో భారీగా వర్షాలు

మాండూస్ తుపాను నేపథ్యంలో ఏపీ వాసులకు వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తుపాను నేపథ్యంలో కామన్ అలర్ట్ ప్రోటోకాల్ ద్వారా 6 జిల్లాల్లోని ప్రజలను అధికారులు సూచనలు ఇస్తున్నారు. ప్రస్తుతం కారైకాల్ కి తూర్పు- ఆగ్నేయంగా 530 కిలోమీటర్ల, చెన్నైకి 620 కిమీల దూరంలో కేంద్రీక్రుతమై వుందని అధికారులు ప్రకటించారు. ఇది గంటకు 10 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా శ్రీలంక, తమిళనాడు వైపు దూసుకోస్తుంది. బుధవారం రాత్రి శ్రీలంకకి 410 కిలోమీటర్ల, జాఫ్నాకి 550 కిలోమీటర్లు, చెన్నైకి 700 కిలోమీటర్ల దూరంలో వుంది. శుక్రవారం రాత్రికి తమిళనాడులోని మహాబలిపురం సమీపంలో తీరం దాటుతుందని అధికారులు చెబుతున్నారు. తీరం దాటిన తర్వాత వాయుగుండంగా బలహీనపడి, చిత్తూరు వైపు కదులుతుందని చెబుతన్నారు.

మాండూస్ ప్రభావంతో 8 నుంచి 3 రోజుల పాటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు ప్రకటించారు. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ నెల 10,11 తేదీల్లో ఏపీలో భారీగా వర్షాలు పడతాయని ప్రకటించారు. మత్స్యకారులు ఎవ్వరు కూడా వేటకు వెళ్లొద్దని, వెళ్లిన వారు తిరిగి వచ్చేయాలని పిలుపునిచ్చారు.

Related Posts

Latest News Updates