కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై భక్తులకు అరిటాకుల్లో అన్న ప్రసాదం కాకుండా… కంచాల్లోనే అందించాలని నిర్ణయం తీసుకున్నారు. 35 సంవత్సరాలుగా దేవస్థానం భక్తులకు అరిటాకుల్లోనే అన్న ప్రసాదాన్ని అందిస్తూ వస్తోంది. ప్రస్తుతం అరిటాకులు లభ్యం కాకపోవడం, కొరత కారణంగా ఇకపై కంచాల్లోనే ప్రసాద వితరణ చేయాలని డిసైడ్ అయ్యారు. కంచాలను శుభ్రం చేయడానికి దేవస్థానం అధికారులు యంత్రాలను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ యంత్రాలు కంచాలను శుభ్రంగా కడిగి… భక్తులకు అందుబాటులోకి ఇవ్వనున్నాయి.












