హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటి కిర్స్టీ అల్లీ (71) కన్నుమూశారు. గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె ఈనెల 5వ తేదీ (సోమవారం) రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కిర్స్టీ కుమారుడు విలియం ట్రూ స్టీవెన్సన్, కుమార్తె లిల్లీ ప్రైస్ స్టీవెన్సన్ ప్రకటించారు. తమ తల్లి కిర్ స్టీ అల్లీ.. ఇన్నాళ్లూ గొప్పగా పోరాడిందని, ఆమె జీవితంలోని అంతులేని ఆనందాలను తమకు వదిలేసి వెళ్లిపోయిందని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. మోఫిట్ క్యాన్సర్ సెంటర్లోని వైద్యులు, నర్సుల బృందం మెరుగైన చికిత్స అందించారని, వారికి తాము కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు.