ఆహ్లాదకర వాతావరణంలో జీ 20 సన్నాహాక సమావేశం… సోషల్ మీడియాలో వైరల్

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ లో జీ 20 సన్నాహక సమావేశం అద్భుతంగా జరిగింది. ఈ సమావేశానికి ఆయా పార్టీల అధ్యక్షులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీలకతీతంగా అందరితో ప్రధాని నరేంద్ర మోదీ ఆప్యాయంగా, పలకరింపులతో, నవ్వులతో మాట్లాడారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్స్ తెగ మెచ్చుకుంటున్నారు. ఆయా రాజకీయ పక్షాల మధ్య ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణం వుండాలని ఆకాంక్షించారు. సీపీఎం నేత ఏచూరీ, డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ తో, సీపీఐ నేత రాజాతో, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, సీఎం జగన్ తో ప్రధాని మోదీ చాయ్ తాగుతూ ఆప్యాయంగా మాట్లాడించారు. జి-20 దేశాల అధ్యక్ష బాధ్యతలను భారత్‌ ఇటీవల స్వీకరించింది.

దీంతో వచ్చే యేడాది సెప్టెంబరులో జి-20 శిఖరాగ్ర సమా వేశం ఢిల్లీలో జరుగనుంది. ఈ సమావేశంలో భాగంగా ఒక్కో అంశంపై చర్చించే నిమిత్తం సమావేలను ఒక్కో నగరంలో ఏర్పాటు చేయాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది.

పైగా ఈ శిఖరాగ్ర సదస్సు విజయవంతం చేసేందుకు వీలుగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి ప్రధాని సూచనలు, సలహాలు స్వీకరించి, వారితో కలిసి మాట్లాడారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిని అఖిలపక్ష సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్దీప్‌ ధన్కర్‌ తదితరులు పాల్గొన్నారు

Related Posts

Latest News Updates