గుజరాత్ లో మళ్లీ కమల వికాసమేనని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. గుజరాత్ లో ప్రధాని మోదీ ఛరిష్మా తీవ్రంగా పనిచేసిందని ఎగజిట్ పోల్స్ అంటున్నాయి. గుజరాత్ లో బీజేపీకి 128 స్థానాల నుంచి 148 స్థానాలు దక్కుతాయని రిపబ్లిక్ భారత్ అనగా, కాంగ్రెస్ కి 30 నుంచి 42 స్థానాలు దక్కవచ్చని, ఆప్ కి 2 నుంచి 10 స్థానాలు దక్కుతాయని అంచనా వేసింది. ఇక పీపుల్స్ పల్స్ బీజేపీకి 125 నుంచి 143 స్థానాలు, కాంగ్రెస్ కి 30 నుంచి 48 స్థానాలు, ఆప్ క 3 నుంచి 7 స్థానాలని పేర్కొంది. ఆత్మ సాక్షి బీజేపీకి 98 నుంచి 110 స్థానాలు, కాంగ్రెస్ కి 66 నుంచి 71 స్థానాలు, ఆప్ కి 9 నుంచి 14 స్థానాలని తేల్చింది. న్యూస్ ఎక్స్ అనే సంస్థ బీజేపీకి 117 నుంచి 140 స్థానాలు, కాంగ్రెస్ కి 34 నుంచి 51, ఆప్ కి 6 నుంచి 13 స్థానాలని అంచనా వేసింది.
ఇక హిమాచల్ లో మాత్రం బీజేపీ, కాంగ్రెస్ మధ్య టఫ్ వార్ నడుస్తోందని అందరూ అంటున్నారు. పీపుల్స్ సర్వే సంస్థ హిమాచల్ లో బీజేపీకి 27 నుంచి 37 స్థానాలు, కాంగ్రెస్ కి 29 నుంచి 39 స్థానాలు, ఆప్ కి 2 నుంచి 5 స్థానాలని చెబుతోంది. ఇక.. రిపబ్లిక్ టీవీ బీజేపీకి 32 నుంచి 40 స్థానాలు, కాంగ్రెస్ కి 27 నుంచి 34 స్థానాలు అని, న్యూఎస్ ఎక్స్ 34 నుంచి 39 స్థానాలు బీజేపీకి, కాంగ్రెస్ కి 28 నుంచి 33 స్థానాలని చెబుతోంది. ఇక.. టైమ్స్ నౌ సంస్థ బీజేపీకి 38, కాంగ్రెస్ కి 28 అని చెబుతోంది.